నెల్లూరులో జూడాల ఆందోళన
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కేసులు ఎన్ని పెరిగినా టెస్టులు మాత్రం తగ్గించబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే వైద్యులకు, సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే కొవిడ్ విధులు నిర్వహిస్తున్న జూడాలు నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో బుధవారం ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. మాస్కులు, పీపీఈ కిట్లు […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కేసులు ఎన్ని పెరిగినా టెస్టులు మాత్రం తగ్గించబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే వైద్యులకు, సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు.
ఈ క్రమంలోనే కొవిడ్ విధులు నిర్వహిస్తున్న జూడాలు నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో బుధవారం ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. మాస్కులు, పీపీఈ కిట్లు నాసిరకం అందిస్తున్నారని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీలో పలువురు డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అలాంటి ప్రభుత్వం తమ పట్ల జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జూడాలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వారియర్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.