Junior doctors protest :నేటి నుంచి సమ్మె.. అత్యవసర సేవలు మినహా..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.  జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొనగా.. అత్యవసర సేవలు మినహా అన్ని విధులు బహిష్కరించారు. దీంతో ఆస్పత్రుల్లో చాలా సేవలు నిలిచిపోయాయి. పెంచిన స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు గచ్చిబౌలి టిమ్స్, కింగ్ […]

Update: 2021-05-25 20:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొనగా.. అత్యవసర సేవలు మినహా అన్ని విధులు బహిష్కరించారు. దీంతో ఆస్పత్రుల్లో చాలా సేవలు నిలిచిపోయాయి. పెంచిన స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోటి ఆసుపత్రిల ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు ఉస్మానియా మెడికల్ కళాశాలలో సమావేశం నిర్వహించి తదుపరి నిరసన కార్యక్రమాలపై వివరాలు వెల్లడించనున్నారు.

అటు వ‌రంగ‌ల్ ఎంజీఎంలో జూడాల స‌మ్మె చేపట్టారు. తమ సమస్యల ప‌రిష్కరించాల‌ని ప‌లుమార్లు విన్న‌వించిన రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త జూనియ‌ర్ డాక్ట‌ర్ల సంఘం స‌మ్మెలో భాగంగా బుధ‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ ఎంజీఎం జూడాలు విధుల‌ను బ‌హిష్క‌రించారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవల విధుల‌ను బ‌హిష్క‌రించిన‌ట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఓవైపు కోవిడ్ రోగుల‌కు అంద‌జేస్తున్న చికిత్స‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్ల సేవ‌లే కీల‌కంగా మారాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో జూడాల స‌మ్మె ఎఫెక్ట్ వైద్య సేవ‌ల‌పై ప‌డుతుంద‌ని వైద్యా ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News