నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు
దిశ , నిజామాబాద్: నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌లో ప్రభుత్వం అనుమతిచ్చిన కొవిడ్- 19 పరీక్షల కేంద్రం (వైరాలజీ ల్యాబ్) లో కరోనా పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షలు స్థానికంగా నిర్వహించదానికి శనివారం ప్రభుత్వం ఆమోదం తెలపిందని పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి రోజుకూ 30 మందికి టెస్టులు జరపనున్నట్లు, మొదట హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు, ఐసోలేషన్లో ఉన్నవారికి పరీక్షలు చేస్తామన్నారు. ఈ టెస్టులను క్రమేణా […]
దిశ , నిజామాబాద్: నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌లో ప్రభుత్వం అనుమతిచ్చిన కొవిడ్- 19 పరీక్షల కేంద్రం (వైరాలజీ ల్యాబ్) లో కరోనా పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షలు స్థానికంగా నిర్వహించదానికి శనివారం ప్రభుత్వం ఆమోదం తెలపిందని పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి రోజుకూ 30 మందికి టెస్టులు జరపనున్నట్లు, మొదట హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు, ఐసోలేషన్లో ఉన్నవారికి పరీక్షలు చేస్తామన్నారు. ఈ టెస్టులను క్రమేణా 100కు పెంచుతామని కలెక్టర్ చెప్పారు.ప్రస్తుతం కోవిడ్ పేషెంట్ల కోసం 200 పడకల హాస్పిటల్ సిద్ధంగా ఉందని, 20 వెంటిలేటర్లు కొవిడ్ పేషెంట్ల కొరకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతే కాకుండా 80 మందికి ఆక్సిజన్ సపోర్టింగ్ పరికరాలుఅందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. మరో 500 మందికి సరిపడా ఆక్సిజన్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ మంజూరైందని, ఒకటి రెండ్రోజుల్లో పనులు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.