జూలై 4న ఆల్ పార్టీ మీటింగ్

దిశ, ఏపీ బ్యూరో: జూలై 4 నాటికి అమరావతి రాజధాని ఉద్యమం మొదలు పెట్టి సరిగ్గా 200 రోజులకు చేరుకుంటుందని జేఏసీ తెలిపింది. అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి దీనిపై మాట్లాడుతూ, జూలై 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు ఇళ్లలోనే ఉండి నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఆ సమయంలోనే ఉదయం 11 గంటలకు జూమ్ యాప్‌లో మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఉద్యమంలో ఇప్పటి వరకు 68 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన […]

Update: 2020-07-02 01:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: జూలై 4 నాటికి అమరావతి రాజధాని ఉద్యమం మొదలు పెట్టి సరిగ్గా 200 రోజులకు చేరుకుంటుందని జేఏసీ తెలిపింది. అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి దీనిపై మాట్లాడుతూ, జూలై 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు ఇళ్లలోనే ఉండి నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఆ సమయంలోనే ఉదయం 11 గంటలకు జూమ్ యాప్‌లో మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఉద్యమంలో ఇప్పటి వరకు 68 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. వైజాగ్ వాసులు కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భూములమ్ముకున్న ప్రభుత్వం సచివాలయం, హైకోర్టు అమ్ముకోదన్న గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. రాజధానిపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News