ఆ చాంపియన్‌షిప్ నుంచి భారత జట్టు తొలగింపు
దిశ, స్పోర్ట్స్ : భారత జూడో టీమ్ ఆసియా-ఓషియానా చాంపియన్‌షిప్ నుంచి వైదొలగింది. 20 మంది బృందంతో కూడిన జూడో క్రీడాకారులు, కోచ్‌లు ఈ నెల 5న కిర్గిస్తాన్ వెళ్లారు. అక్కడ జరిపిన కరోనా పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో సదరు క్రీడాకారుడిని ఐసోలేషన్‌కు తరలించి మిగిలిన 19 మందిని క్వారంటైన్ చేశారు. కిర్గిస్తాన్ దేశ నిబంధనల ప్రకారం ఒక బృందంలో ఒకరికి కరోనా సోకినా మిగతా సభ్యులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అయితే […]
దిశ, స్పోర్ట్స్ : భారత జూడో టీమ్ ఆసియా-ఓషియానా చాంపియన్‌షిప్ నుంచి వైదొలగింది. 20 మంది బృందంతో కూడిన జూడో క్రీడాకారులు, కోచ్‌లు ఈ నెల 5న కిర్గిస్తాన్ వెళ్లారు. అక్కడ జరిపిన కరోనా పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో సదరు క్రీడాకారుడిని ఐసోలేషన్‌కు తరలించి మిగిలిన 19 మందిని క్వారంటైన్ చేశారు. కిర్గిస్తాన్ దేశ నిబంధనల ప్రకారం ఒక బృందంలో ఒకరికి కరోనా సోకినా మిగతా సభ్యులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అయితే దీనిపై బృంద సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చాంపియన్‌షిప్‌లో అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై నిర్వాహకులతో చర్చలు జరుపుతున్న సమయంలో మరో క్రీడాకారుడు కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో భారత బృందాన్ని టోర్నీ నుంచి తప్పించారు. మిగిలిన జూడో క్రీడాకారులకు కూడా కరోనా టెస్టులు చేసి నెగెటివ్ వస్తే ఇండియాకు తిరిగి పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఈ చాంపియన్‌షిప్ ఒలంపిక్స్ క్వాలిఫయర్ కావడంతో భారత బృందం నస్టపోవాల్సి వస్తుంది. ఏప్రిల్ 10న ఈ చాంపియన్‌షిప్ ముగియనున్నది.