అమరవీరుల స్తూపానికి జర్నలిస్టుల నివాళి
దిశ, రంగారెడ్డి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి జర్నలిస్టులు నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అమరవీరుల స్థుపానికి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి ఆరెండ్లు గడిచినా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు పరిస్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రిడేషన్ మంజూరు, హెల్త్ కార్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, జర్నలిస్టులకు […]
దిశ, రంగారెడ్డి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి జర్నలిస్టులు నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అమరవీరుల స్థుపానికి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి ఆరెండ్లు గడిచినా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు పరిస్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రిడేషన్ మంజూరు, హెల్త్ కార్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశలవారిగా పోరాటాలు చేస్తామని జర్నలిస్టులు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మేకల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్, కోశాధికారి శశిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు అశోక్, శేఖర్, భుజంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.