కేసులు ఎత్తివేయాలని మోకాళ్ల‌పై జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న‌

దిశ‌, ఖ‌మ్మం: మ‌ధిర మండ‌ల కేంద్రంలో మద్యం తాగుతూ పట్టుబడ్డ అధికారుల విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసిన జ‌ర్న‌లిస్టుల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం పట్ల పలు జర్నలిస్టు సంఘాల నాయ‌కులు మండిప‌డ్డారు. ఈ ఘటనలో విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ముదిగొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం మోకాళ్ల‌పై నిల్చుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిరసన కార్య‌క్ర‌మంలో పాలేరు ఎలక్ట్రానిక్ మీడియా, ముదిగొండ మండల జర్నలిస్టుల నాయ‌కులు పాల్గొన్నారు. అంత‌కుముందు సీఎల్పీ నేత భట్టి […]

Update: 2020-04-16 03:28 GMT

దిశ‌, ఖ‌మ్మం: మ‌ధిర మండ‌ల కేంద్రంలో మద్యం తాగుతూ పట్టుబడ్డ అధికారుల విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసిన జ‌ర్న‌లిస్టుల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం పట్ల పలు జర్నలిస్టు సంఘాల నాయ‌కులు మండిప‌డ్డారు. ఈ ఘటనలో విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ముదిగొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం మోకాళ్ల‌పై నిల్చుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిరసన కార్య‌క్ర‌మంలో పాలేరు ఎలక్ట్రానిక్ మీడియా, ముదిగొండ మండల జర్నలిస్టుల నాయ‌కులు పాల్గొన్నారు. అంత‌కుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అంద‌జేశారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు నిర్వహించిన ఆపరేషన్‌ను వక్రీకరించిన వారిపైనే కేసులు పెట్టాలని కోరారు. అలాగే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌నూ కలిసి విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంట‌నే కొట్టివేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. పోలీస్ కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు తెలిపారు.

tags : Journalists, protest, lift cases, madhira, khammam, minister ajay kumar

Tags:    

Similar News