వృత్తి కన్నా ప్రాణం విలువైనది: అల్లం నారాయణ
దిశ, న్యూస్‌బ్యూరో: వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలో 53మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నందున రాష్ట్రంలో పాత్రికేయులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాములాంటిదని, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందిన ప్రాంతాలకు వెళ్లాల్సిన […]
దిశ, న్యూస్‌బ్యూరో: వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలో 53మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నందున రాష్ట్రంలో పాత్రికేయులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాములాంటిదని, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందిన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోందన్నారు.
Tags: corona virus, Telangana media academy chairman, allam narayana, maharashtra, 53 journalists, Positive police, Telangana