Telangana Corona Cases : ఫ్రంట్‌లైన్ వారియర్లుగా జర్నలిస్టులు.. కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్!

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాజా హెల్త్ బులెటిన్ పై ప్రకటన చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 3762 కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ అడ్మిషన్స్ తగ్గాయని చెప్పుకొచ్చారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 24,105 మంది కోలుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా జర్నలిస్టులను ఫ్రంట్ […]

Update: 2021-05-26 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాజా హెల్త్ బులెటిన్ పై ప్రకటన చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 3762 కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ అడ్మిషన్స్ తగ్గాయని చెప్పుకొచ్చారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 24,105 మంది కోలుకున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినట్లు డీహెచ్ ప్రకటించారు.ఈ నెల 28,29,30 తేదీల్లో సూపర్ స్ర్పెడర్స్‌కు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో ప్రస్తుతం రెండో డోస్ మాత్రమే వేస్తున్నట్లు డీహెచ్ గుర్తు చేశారు. మొత్తం 7లక్షల 75వేల మంది సూపర్ స్ర్పెడర్స్‌ను గుర్తించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొదటి, రెండో డోసు వేసుకోవచ్చని తెలిపారు.

Tags:    

Similar News