టి.కన్సల్ట్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ మ్యాచింగ్ గ్రాంట్
దిశ, న్యూస్‌బ్యూరో: టెలీ మెడిసిన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత సేవలు అందించిన టి.కన్సల్ట్‌కు గుర్తింపు దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 3300 డాలర్ల మ్యాచింగ్ గ్రాంట్ అందించింది. 3300 డాలర్ల గ్రాంట్ పత్రాన్ని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందనకు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల అందించారు. ఈ సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు, తరంగిణి గ్రేటర్ సిన్సినాటి తెలుగు అసోసియేషన్, ఆరుగురు విద్యార్థులకు కలెక్టర్ హరిచందన కృతజ్ఞతలు తెలిపారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో: టెలీ మెడిసిన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత సేవలు అందించిన టి.కన్సల్ట్‌కు గుర్తింపు దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 3300 డాలర్ల మ్యాచింగ్ గ్రాంట్ అందించింది. 3300 డాలర్ల గ్రాంట్ పత్రాన్ని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందనకు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల అందించారు. ఈ సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు, తరంగిణి గ్రేటర్ సిన్సినాటి తెలుగు అసోసియేషన్, ఆరుగురు విద్యార్థులకు కలెక్టర్ హరిచందన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నుంచి నారాయణపేట జిల్లాలో ఈ నిధులతో పలు కార్యక్రమాలు మొదలయ్యాయి.
ప్రజలు వైద్య సేవలు అందుకోవడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన టీటా టి.కన్సల్ట్ యాప్‌ను తీసుకురాగా ఇప్పటివరకు పదివేల కన్సల్టేషన్లు పూర్తి చేశారు. దీనికి అమెరికా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ దిలీప్ బీరెల్లి అండగా నిలిచారు. నీరజ్ కోనేరు, రాజీవ్ కున్నపరాజు, వంశి సింగిడి, వరుణ్ గుడ్ల, విధాత్ వేదాటి, వరుణ్ గుడ్ల నిర్వహించిన ప్రాజెక్టుకు జాన్సన్ ఆండ్ జాన్సన్ కేరింగ్ క్రౌడ్ గ్రాంట్ కింద మ్యాచింగ్ గ్రాంట్ సాధించేలా డాక్టర్ దిలీప్ కృషి చేశారు. ఈ మేరకు సంస్థ తెలంగాణలో టి.కన్సల్ట్ ద్వారా టెలీ మెడిసిన్ సేవలు అందించేందుకు 3300 డాలర్లు కమ్యూనిటీ గ్రాంట్ అందించింది. ఈ గ్రాంట్‌కు అదనంగా నిధులు సమకూర్చడంలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియాకు చెందిన పలువురు తమ సహకారాన్ని అందించారు. ఈ మేరకు నిధులను నారాయణపేట్ జిల్లాలో టెలీ మెడిసన్ సేవలు అందించడంలో భాగంగా ఉపయోగించనున్నారు. గ్రాంట్ అందించిన జాన్సన్ ఆండ్ జాన్సన్ సంస్థకు, తరంగిణి గ్రేటర్ సిన్సినాటి తెలుగు అసోసియేషన్ కు, ఆరుగురు విద్యార్థుల బృందానికి సందీప్ మక్తాల కృతజ్ఞతలు తెలిపారు.