ఆ గిటార్ రూ. 6 కోట్లు.. ఎందుకంత ధరో తెలుసా..?

దిశ, ఫీచర్స్: అమెరికన్ గిటారిస్ట్ జాన్ విలియం కమిన్స్‌ను వృత్తిపరంగా జానీ రామోన్ అని పిలుస్తారు. గిటారిస్ట్‌గానే కాకుండా పాటల రచయితగా, నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పంక్ రాక్ బ్యాండ్’‌‌లో సభ్యుడిగా ఉన్న రామోన్.. గాయకుడు జోయి రామోన్‌తో పాటు ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2009లో టైమ్స్‌ ‘ది 10 గ్రేటెస్ట్ ఎలక్ట్రిక్-గిటార్ ప్లేయర్స్’ జాబితాలో స్థానం పొందాడు. అంతేకాదు స్పిన్ 2012 ‘ఆల్ టైమ్ 100 గ్రేటెస్ట్ గిటారిస్ట్స్’ తో పాటు రోలింగ్ స్టోన్ […]

Update: 2021-09-29 04:16 GMT

దిశ, ఫీచర్స్: అమెరికన్ గిటారిస్ట్ జాన్ విలియం కమిన్స్‌ను వృత్తిపరంగా జానీ రామోన్ అని పిలుస్తారు. గిటారిస్ట్‌గానే కాకుండా పాటల రచయితగా, నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పంక్ రాక్ బ్యాండ్’‌‌లో సభ్యుడిగా ఉన్న రామోన్.. గాయకుడు జోయి రామోన్‌తో పాటు ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2009లో టైమ్స్‌ ‘ది 10 గ్రేటెస్ట్ ఎలక్ట్రిక్-గిటార్ ప్లేయర్స్’ జాబితాలో స్థానం పొందాడు. అంతేకాదు స్పిన్ 2012 ‘ఆల్ టైమ్ 100 గ్రేటెస్ట్ గిటారిస్ట్స్’ తో పాటు రోలింగ్ స్టోన్ గ్రేటెస్ట్ గిటారిస్ట్ లిస్ట్‌లోనూ ఉన్నాడు. అయితే ఈ లెజెండ్ ఉపయోగించిన ‘గిటార్’‌ను వేలం వేయగా, $ 900,000 (రూ. 6,68,14,650) కంటే ఎక్కువగా అమ్ముడైనట్లు వేలం నిర్వహాకులు వెల్లడించారు.

రామోన్ సంగీత వృత్తితో పాటు దాదాపు డజను చిత్రాల్లో, పలు డాక్యుమెంటరీస్‌లో నటించాడు. ది సింప్సన్స్, స్పేస్ ఘోస్ట్ కోస్ట్ టు కోస్ట్ వంటి టెలివిజన్‌లలో ప్రదర్శనలు చేశాడు. రామోన్ 15 ఆల్బమ్స్‌లో, దాదాపు 2,000 లైవ్ ప్రదర్శనలలో ఉపయోగించిన గిటార్‌ను బోస్టన్ ఆధారిత ఆర్ఆర్ అక్షన్ హౌజ్ వేలం వేయగా.. రూ. 6 కోట్లకు పైగా పలికింది. ఈ గిటార్‌ను నవంబర్ 1977 నుంచి ఆగస్టు 1996 లో రామోన్ వినియోగించాడు.

అతని ఆత్మకథ, ‘కమాండో’ పేరుతో మరణానంతరం 2012లో విడుదల కాగా.. ఈ పుస్తకంలో రామోన్ తన బేస్ బాల్‌పై తనకున్న అమితమైన ప్రేమ, బేస్ బాల్ కార్డులు, సినిమా పోస్టర్లు, ముఖ్యంగా భయానక సంబంధిత పోస్టర్లు సేకరించేవాడినని చెప్పుకొచ్చాడు. విక్రయించిన మరికొన్ని వస్తువుల్లో జానీ రామోన్ మార్క్ -2 సిగ్నేచర్ గిటార్ దాదాపు $ 50,000లు అమ్మడు పోగా, ఫైనల్ రామోన్స్ కచేరీలో జోయి రామోన్స్ వాడిన షురే మైక్రోఫోన్‌లు $ 13,000 కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి.

Tags:    

Similar News