జాన్ పహడ్ దర్గా కాంట్రాక్ట్.. ఎన్ని కోట్లంటే ?

దిశ నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రంలోనే మత సామరస్యానికి గుర్తుగా హిందూ ముస్లింల ఐక్యంగా మొక్కుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా. ప్రస్థుతం ఈ కాంట్రాక్ట్ బాధ్యతలను ఒక సంవత్సరం కాలపరిమితితో 1 కోటి 59 లక్షలకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖాజా కు వక్ఫ్ బోర్డ్ నిర్ణయించి అప్పగించింది. ఈ విషయాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ […]

Update: 2021-09-30 22:23 GMT

దిశ నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రంలోనే మత సామరస్యానికి గుర్తుగా హిందూ ముస్లింల ఐక్యంగా మొక్కుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా. ప్రస్థుతం ఈ కాంట్రాక్ట్ బాధ్యతలను ఒక సంవత్సరం కాలపరిమితితో 1 కోటి 59 లక్షలకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖాజా కు వక్ఫ్ బోర్డ్ నిర్ణయించి అప్పగించింది. ఈ విషయాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఖాజా శుక్రవారం ఉదయం విలేకరులకు తెలిపారు.

ఒక సం॥ కాలపరిమితికి 1 కోటి 59 లక్షలు

శుక్రవారం రాత్రి నుంచి ఒక సంవత్సర కాలపరిమితితో 30 సెప్టెంబర్ 2021 నుండి 29 సెప్టెంబర్ 2022 వరకు కాంట్రాక్టర్లకు బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ కాంట్రాక్టరు 1 కోటి 50 లక్షలు టెండర్ ద్వారా అదనంగా మెయింటెనెన్స్ ఖర్చు 9 లక్షలు కలిపి ఒక కోటి 59 లక్షలకు నిర్ణయించి తెలిపారు .

గతంలో కంటే 20 శాతం అధికం

గత సంవత్సరం 1 కోటి 25 లక్షలకు టెండర్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ కే ఈసారి కూడా వక్ఫ్ బోర్డు అప్పగించింది . గతంలో కాంట్రాక్టర్ టెండర్ ద్వారా దక్కించుకున్న మహ్మద్ ఖాజా కరోణ వైరస్ వ్యాప్తి చెందడం వలన ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో తమకు నష్టం జరిగిందని తమకే మళ్లీ కాంట్రాక్టర్ బాధ్యతలు అప్పగించాలని వక్ఫ్ బోర్డుకు లెటర్ పెట్టుకున్నారు. ఆ లెటర్ ను పరిశీలించిన వక్ఫ్ బోర్డు కమిటీ గతంలో కంటే అదనంగా 20 శాతం వక్ఫ్ బోర్డుకు చెల్లిస్తే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పడంతో గత సంవత్సరం టెండరుకంటే 25 లక్షలు తోపాటు మెయింటెన్ ఛార్జీ 9 లక్షలు చెల్లించడంతో వారికే బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News