జపనీస్ ఒలింపిక్ కమిటీ అధికారి ఆత్మహత్య

దిశ, స్పోర్ట్స్: జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేవోసీ)లో పని చేస్తున్న సీనియర్ అధికారి యసుషీ మోరియ (52) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన రైలు కింద పడి ఈ అఘత్యానికి పాల్పడినట్లు టోక్యో పోలీసులు తెలిపారు. ఒలింపిక్స్‌కు చెందిన డేటా బ్రీచ్ వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు జేవోయే అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వారిపై నిఘా పెరిగిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ అధికారి ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. […]

Update: 2021-06-07 10:34 GMT

దిశ, స్పోర్ట్స్: జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేవోసీ)లో పని చేస్తున్న సీనియర్ అధికారి యసుషీ మోరియ (52) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన రైలు కింద పడి ఈ అఘత్యానికి పాల్పడినట్లు టోక్యో పోలీసులు తెలిపారు. ఒలింపిక్స్‌కు చెందిన డేటా బ్రీచ్ వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు జేవోయే అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వారిపై నిఘా పెరిగిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ అధికారి ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది.

టోక్యో మెట్రొపాలిటన్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టోక్యోలోని నకనోబు స్టేషన్ వద్ద పడి ఉన్న వ్యక్తిని గుర్తించి స్థానికులు సమాచారం అందించగా.. అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి,

Tags:    

Similar News