టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే ?
చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ).. 2022-23 ఏడాదికి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ).. 2022-23 ఏడాదికి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
టైపిస్ట్ - 2 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు తెలుగులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: దరఖాస్తులను వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేడ్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందించాలి.
చివరి తేదీ: మే 15, 2023.
వెబ్సైట్: https://chittoor.ap.gov.in/