AIIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMSలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ జరిగింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER భర్తీచేసింది. తాజాగా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 10 ఖాళీలు ఏర్పడ్డాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMSలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ జరిగింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER భర్తీచేసింది.
తాజాగా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 10 ఖాళీలు ఏర్పడ్డాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2020 జూలై 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం జిప్మర్ అధికారిక వెబ్సైట్ https://main.jipmer.edu.in/ చూడొచ్చని అధికారులు తెలిపారు.