సెప్టెంబర్‌లో స్థిరంగా నియామకాల ప్రక్రియ!
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ప్రింటింగ్, ప్యాకేజింగ్ విభాగాల్లో డిమాండ్ కారణంగా సెప్టెంబర్‌లో నియామకాలు 1 శాతం పెరిగాయని మాన్‌స్టర్ డాట్ కామ్ ఎంప్లాయ్‌మెంట్ సూచీ వెల్లడించింది. ఈ వృద్ధికి బీపీఓ, ఐటీ సంబంధిత సేవ్లు, దిగుమతులు, ఎగుమతుల రంగాలు కూడా దోహదపడ్డాయని మాన్‌స్టర్ డాట్ కామ్ నివేదిక తెలిపింది. ఆగష్టు, సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ నెలలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నెలవారీగా స్థిరమైన వృద్ధిని నమోదైంది. సమీక్షించిన నెలలో ఆన్‌లైన్ అమ్మకాలు పెరగడంతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ప్రింటింగ్, ప్యాకేజింగ్ విభాగాల్లో డిమాండ్ కారణంగా సెప్టెంబర్‌లో నియామకాలు 1 శాతం పెరిగాయని మాన్‌స్టర్ డాట్ కామ్ ఎంప్లాయ్‌మెంట్ సూచీ వెల్లడించింది. ఈ వృద్ధికి బీపీఓ, ఐటీ సంబంధిత సేవ్లు, దిగుమతులు, ఎగుమతుల రంగాలు కూడా దోహదపడ్డాయని మాన్‌స్టర్ డాట్ కామ్ నివేదిక తెలిపింది. ఆగష్టు, సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ నెలలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నెలవారీగా స్థిరమైన వృద్ధిని నమోదైంది. సమీక్షించిన నెలలో ఆన్‌లైన్ అమ్మకాలు పెరగడంతో ప్రింటింగ్, ప్యాకేజింగ్ కోసం నియామకాలు 11 శాతం పెరిగాయి.
బీపీఓ, ఐటీ సంబంధిత సేవల రంగంలో 5 శాతం, దిగుమతి, ఎగుమతుల్లో 4 శాతం, రిటైల్ రంగంలో 2 శాతం, ప్రయాణ, పర్యాటక రంగాల్లో 2 శాతం నియామకాలు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో పోలిస్తే నియామకాలు 9 శాతం మెరుగుపడ్డాయని, ఈ పరిణామాలు నియామకాల్లో సానుకూల దృక్పథాన్ని సూచిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. గడిచిన ఆరు నెలల్లో నియామకాల గిరాకీ 8 శాతం పెరిగింది. నగరాల వారీగా గతేడాదితో పోల్చి చూస్తే.. సెప్టెంబర్‌లో నియామకాల ప్రక్రియ మెరుగ్గా ఉందని మాన్‌స్టర్ డాట్ కామ్ తెలిపింది. బెంగళూరులో 38 శాతం, పూణె 22 శాతం, హైదరాబాద్‌లో 20 శాతం, చెన్నైలో 18 శాతం నియామకాలు పెరిగాయి.