గుడ్‌న్యూస్.. ‘జాన్సన్’తో ‘డెల్టా’కు చెక్
వాషింగ్టన్: తాము రూపొందించిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ‘డెల్టా వేరియంట్’ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా సహా అన్ని రకాల వేరియంట్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. అదీకూడా టీకా తీసుకున్న 29రోజుల్లోనే ప్రొడ్యూస్ అవడం గుర్తించామని వెల్లడించింది. ఈ యాంటీబాడీలు కనీసం 8నెలలపాటు ఉత్పత్తి […]
వాషింగ్టన్: తాము రూపొందించిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ‘డెల్టా వేరియంట్’ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా సహా అన్ని రకాల వేరియంట్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. అదీకూడా టీకా తీసుకున్న 29రోజుల్లోనే ప్రొడ్యూస్ అవడం గుర్తించామని వెల్లడించింది. ఈ యాంటీబాడీలు కనీసం 8నెలలపాటు ఉత్పత్తి అవుతాయని స్పష్టంచేసింది.