పెరిగిన జియో నెట్‌వర్క్ వినియోగదారులు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో మరింత మంది చందాదారులు కొత్తగా చేరడంతో ఏప్రిల్‌లో 47.56 లక్షల వినియోగదారులను సంపాదించింది. దీంతో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 42.76 కోట్లకు పైగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. సమీక్షించిన నెలలో భారతీ ఎయిర్‌టెల్ 5.17 లక్షలకు పైగా వినియోగదారులను సంపాదించిందని, మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.29 కోట్లకు పైగా ఉంది. ఇక, వొడాఫోన్ […]

Update: 2021-07-12 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో మరింత మంది చందాదారులు కొత్తగా చేరడంతో ఏప్రిల్‌లో 47.56 లక్షల వినియోగదారులను సంపాదించింది. దీంతో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 42.76 కోట్లకు పైగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. సమీక్షించిన నెలలో భారతీ ఎయిర్‌టెల్ 5.17 లక్షలకు పైగా వినియోగదారులను సంపాదించిందని, మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.29 కోట్లకు పైగా ఉంది. ఇక, వొడాఫోన్ ఐడియా వరుసగా రెండు నెలలు వినియోగదారులను సంపాదించిన తర్వాత ఏప్రిల్‌లో 18.10 లక్షల సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయి మొత్తం 28.19 కోట్లకు పడిపోయిందని ట్రాయ్ గణాంకాలు తెలిపాయి.

ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎస్ 13.05 లక్షల మంది వినియోగదారులను కోల్పోయి 11.72 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన నెలలో మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు మార్చి చివరి నాటికి 118 కోట్ల నుంచి 118.3 కోట్లకు పెరిగారు. దీంతో నెలవారీగా వృద్ధి 0.18 శాతం ఉన్నట్టు ట్రాయ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 64.5 కోట్లకు పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 53.74 కోట్లకు పెరిగింది.

Tags:    

Similar News