అమల్లోకి.. రిలయన్స్ జియో ఒప్పందాలు!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియోలో మొత్తం 25.09 శాతం వాటాలను విక్రయించి ఒప్పందం చేసుకున్న పెట్టుబడులు అమల్లోకి వస్తున్నట్టు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఎల్ కాటర్టన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు పూర్తయ్యాయని, 6.13 శాతం విలువైన వాటాలా ద్వారా రూ.30,062 కోట్లను అందుకున్నట్టు సెబీ వద్ద వివరించింది. ఇంతకుముందు ఫేస్‌బుక్‌తో చేసుకున్న ఒప్పందంతో రూ. 43,574 కోట్లను రిలయన్స్ అందుకుంది. దీని ప్రకారం ఫేస్‌బుక్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియోలో మొత్తం 25.09 శాతం వాటాలను విక్రయించి ఒప్పందం చేసుకున్న పెట్టుబడులు అమల్లోకి వస్తున్నట్టు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఎల్ కాటర్టన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు పూర్తయ్యాయని, 6.13 శాతం విలువైన వాటాలా ద్వారా రూ.30,062 కోట్లను అందుకున్నట్టు సెబీ వద్ద వివరించింది. ఇంతకుముందు ఫేస్‌బుక్‌తో చేసుకున్న ఒప్పందంతో రూ. 43,574 కోట్లను రిలయన్స్ అందుకుంది. దీని ప్రకారం ఫేస్‌బుక్‌కు చెందిన జాదు హోల్డింగ్స్‌కు 9.99 శాతం వాటాను కేటాయించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ స్పష్టం చేసింది. ఇక, జియోలో 11 మంది ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ. 1,17,588 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.