జూమ్‌కు కాపీలా జియో మీట్?.. నెటిజన్ల చురకలు
వీడియో కాన్ఫరెన్సింగ్ రంగంలోకి అడుగుపెడుతూ రిలయన్స్ సంస్థ.. జియో మీట్ పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ ఇంటర్‌ఫేస్ అచ్చుగుద్దినట్లు ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్‌ను పోలిఉండటం యాదృచ్ఛికమో, కావాలని చేశారో అర్థం కావట్లేదు. పేర్లు, చిహ్నాలు, సంజ్ఞలు, బొమ్మలు.. ఇలా అన్నీ ఒకేలా ఉండటంతో యూజర్లు శంకిస్తున్నారు. ఇక నెటిజన్లు ఏకంగా ఈ రెండు యాప్‌లను పోల్చుతూ కామెడీ చురకలు అంటిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత వీడియో కాలింగ్ […]
వీడియో కాన్ఫరెన్సింగ్ రంగంలోకి అడుగుపెడుతూ రిలయన్స్ సంస్థ.. జియో మీట్ పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ ఇంటర్‌ఫేస్ అచ్చుగుద్దినట్లు ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్‌ను పోలిఉండటం యాదృచ్ఛికమో, కావాలని చేశారో అర్థం కావట్లేదు. పేర్లు, చిహ్నాలు, సంజ్ఞలు, బొమ్మలు.. ఇలా అన్నీ ఒకేలా ఉండటంతో యూజర్లు శంకిస్తున్నారు. ఇక నెటిజన్లు ఏకంగా ఈ రెండు యాప్‌లను పోల్చుతూ కామెడీ చురకలు అంటిస్తున్నారు.
లాక్‌డౌన్ తర్వాత వీడియో కాలింగ్ ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఈ రంగంలో జియో కూడా ప్రవేశిస్తూ 100 మంది ఒకేసారి మీటింగ్ పెట్టుకునే సదుపాయంతో జియో మీట్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా 24 గంటల పాటు అంతరాయం లేకుండా మాట్లాడుకునే వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే ఇంటర్‌ఫేస్ ఒకేలా ఉండటం మాత్రం వినియోగదారులకు రుచించడం లేదు. మంచి ఆఫర్లతో వినియోగదారులను కట్టిపడేసే జియో.. ఇలా ప్రముఖ యాప్ డిజైన్‌ను కాపీ కొట్టడం బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.