చందాదారులను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా వీఐ(వీ) బ్రాండ్‌గా మారిన వొడాఫోన్ ఐడియా వరుస నెలల్లో తన చందాదారులను కోల్పోయింది. ప్రస్తుత ఏడాది జూన్‌లో వొడాఫోన్ ఐడియా 48 లక్షల మంది చందాదారులను కోల్పోయినట్టు రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. ఇక, దేశీయంగా వరుస సంచలనాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో చందాదారుల విషయంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. జూన్‌లో జియోలోకి కొత్తగా వచ్చిన 44.9 లక్షల మంది చందాదారులతో మొత్తం 39.7 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తెలిపింది. చందాదారులు […]

Update: 2020-09-25 05:33 GMT
చందాదారులను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా వీఐ(వీ) బ్రాండ్‌గా మారిన వొడాఫోన్ ఐడియా వరుస నెలల్లో తన చందాదారులను కోల్పోయింది. ప్రస్తుత ఏడాది జూన్‌లో వొడాఫోన్ ఐడియా 48 లక్షల మంది చందాదారులను కోల్పోయినట్టు రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. ఇక, దేశీయంగా వరుస సంచలనాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో చందాదారుల విషయంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. జూన్‌లో జియోలోకి కొత్తగా వచ్చిన 44.9 లక్షల మంది చందాదారులతో మొత్తం 39.7 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తెలిపింది.

చందాదారులు తగ్గిపోవడంతో వొడాఫోన్ ఐడియా మొత్తం 30.5 కోట్లకు పరిమితమైంది. మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ జూన్‌లో 11.3 లక్షల మందిని కోల్పోయి 31.6 కోట్ల చందాదారులతో సరిపెట్టుకుంది. అలాగే, జూన్ నెల చివరినాటికి మొత్తం వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 0.28 శాతం తగ్గిపోయి 114 కోట్లకు చేరినట్టు నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 0.18 శాతం, గ్రామీణ ప్రాంతంలో 0.40 శాతం వినియోగదారుల సంఖ్య తగ్గింది. మొత్తం బ్రాడ్‌బ్యాంక్ కనెక్షన్లు జూన్ నెలకు 2 శాతం వృద్ధి సాధించి 69.8 కోట్లకు చేరుకున్నాయి.

Tags:    

Similar News