గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో.. మళ్లీ అన్నీ ఫ్రీ!

దిశ, వెబ్‌డెస్క్ : అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 2021 న్యూ ఇయర్ రాబోతున్న తరుణంతో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది… 2021 జనవరి 1 నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది జియో.. మొదట డేటా, కాల్స్ ఫ్రీ అంటూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన జియో.. ఆ తర్వాత టారిఫ్‌ అమలు చేసినా.. డేటాకు మాత్రమే ఛార్జీ విధించి ఏ నెట్‌వర్క్‌కైనా […]

Update: 2020-12-31 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 2021 న్యూ ఇయర్ రాబోతున్న తరుణంతో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది… 2021 జనవరి 1 నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది జియో.. మొదట డేటా, కాల్స్ ఫ్రీ అంటూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన జియో.. ఆ తర్వాత టారిఫ్‌ అమలు చేసినా.. డేటాకు మాత్రమే ఛార్జీ విధించి ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీగా అందించింది.. ఇక, ఆ తర్వాత.. జియో టూ జియో కాల్స్‌ మాత్రమే ఫ్రీ అని.. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకోవాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించాలనే నిబంధనలు విధించి వసూలు చేస్తూ వస్తోంది.. ఈ కాల్స్ కోసం రూ.10 నుంచి టాపప్ ఓచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఇక, న్యూఇయర్‌ సందర్భంగా తన యూజరట్లకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ.. దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా.. ఇక ఫ్రీ అని ప్రకటించింది.

ట్రాయ్ ఆదేశాల మేరకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్‌లకు(ఐయూసీ) 1 జనవరి 2021 నుంచి స్వస్తి పలకనుండటంతో.. మళ్లీ తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకూ ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చని జియో స్పష్టం చేసింది.. జియో నెట్‌వర్క్‌లో ఆన్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఎల్లప్పుడూ ఉచితం అని కంపెనీ ప్రకటించింది.. జియో నుండి దేశంలోని ఎక్కడైనా, ఏ నెట్‌వర్క్‌కైనా ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ 2021 జనవరి 1 నుండి ఉచితం తెలిపింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సాధారణ భారతీయుడిని కూడా లబ్ధిదారునిగా మార్చాలనే నిబద్ధతపై జియో నిలుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, జియో ఈ ప్రకటన చేసిన తర్వాత బీఎస్‌ఈలో భారతి ఎయిర్‌టెల్ షేర్లు దాదాపు 2శాతం పడిపోయాయి. కాగా, గత కొంతకాలంగా జియో యూజర్లు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. రైతుల ఉద్యమం ఎఫెక్ట్‌ కూడా జియోపై పడింది. జియోను బహిష్కరించాలనే ఉద్యమం కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.

Tags:    

Similar News