పాత బకాయి అడిగినందుకు యాసిడ్ పోశాడు
దిశ, పెద్దపల్లి: పాత బకాయి చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిపై జ్యువెలరీ వ్యాపారి యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్‌లో.. తమిళనాడుకు చెందిన శ్రీ సుందర రాజన్ అనే వెండి హోల్ సేల్ వ్యాపారి.. స్థానిక బంగారం షాపుల్లో వెండి వస్తువులు విక్రయిస్తూ డబ్బులు వసూలు చేసుకునేవాడు. కరోనా సమయంలో డబ్బుల వసూళ్లకు రాలేకపోయానని.. శుక్రవారం బకాయి డబ్బులు చెల్లించాలని భాస్కర్ అనే జువెలర్స్ యజమానిని అడుగగా తనపై […]
దిశ, పెద్దపల్లి: పాత బకాయి చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిపై జ్యువెలరీ వ్యాపారి యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్‌లో.. తమిళనాడుకు చెందిన శ్రీ సుందర రాజన్ అనే వెండి హోల్ సేల్ వ్యాపారి.. స్థానిక బంగారం షాపుల్లో వెండి వస్తువులు విక్రయిస్తూ డబ్బులు వసూలు చేసుకునేవాడు. కరోనా సమయంలో డబ్బుల వసూళ్లకు రాలేకపోయానని.. శుక్రవారం బకాయి డబ్బులు చెల్లించాలని భాస్కర్ అనే జువెలర్స్ యజమానిని అడుగగా తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, యాసిడ్‌తో దాడి చేసినట్లు సుందర రాజన్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రాజన్ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నట్టు తెలిపాడు. ఈ విషయం పై వన్ టౌన్ సీ.ఐ రమేష్ బాబుని వివరణ అడుగగా.. జ్యువెలరీ యజమాని వెండి వ్యాపారి సుందర రాజన్‌కు మధ్య పాత బకాయిలు ఉన్నాయని అందుకోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఆ ఘర్షణలో జ్యువెలరీ యజమాని యాసిడ్‌తో దాడి చేసినట్టు వివరణ ఇచ్చారు. దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతడిపై కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణన చేపట్టి బాధితుడికి న్యాయం చేస్తామని సీఐ స్పష్టం చేశారు.