ఊరెళ్లొచ్చేలోపు ఉన్నదంతా ఉడ్చేశారు

దిశ, క్రైమ్ బ్యూరో: సొంతూరుకు వెళ్లొచ్చే సరికి ఇంటిలోని నగలు, నగదు చోరీకి గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం శివరాం అపార్ట్మెంట్‌లో మెదక్ జిల్లా అంబాజీపేటకు చెందిన రాంచందర్ రావు రెండో అంతస్తులోని 201 ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం తన స్వగ్రామమైన మెదక్ జిల్లా అంబాజీపేటకు వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గ్రహించి పోలీసులకు […]

Update: 2020-07-05 11:46 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: సొంతూరుకు వెళ్లొచ్చే సరికి ఇంటిలోని నగలు, నగదు చోరీకి గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం శివరాం అపార్ట్మెంట్‌లో మెదక్ జిల్లా అంబాజీపేటకు చెందిన రాంచందర్ రావు రెండో అంతస్తులోని 201 ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం తన స్వగ్రామమైన మెదక్ జిల్లా అంబాజీపేటకు వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో ఉంచిన 35 తులాల బంగారంతో పాటు రూ.57 లక్షల నగదు దొంగతనానికి గురైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పేట్ బషీర్‌బాద్ ఏసీపీ నరసింహరావు, అల్వాల్ సీఐ పులి యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News