నాని జెర్సీకి అపూర్వ ఘనత
నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రీకొడుకులతో పాటు భార్యాభర్తల బంధం.. ఆటతో ఉన్న అనుబంధాన్ని ఏకం చేస్తూ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడగలిగే సత్తా ఉన్న క్రికెటర్.. పనికిరాని వాడిగా మారిపోయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో చివాట్లు తింటూ ఎందుకు జీవించాడు? తనను అందరూ పనికిరాని వాడిగా చూస్తున్నా.. కొడుకు మాత్రం తనను హీరోలా చూడటం, కొడుకు కళ్లలో ఆ […]
నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రీకొడుకులతో పాటు భార్యాభర్తల బంధం.. ఆటతో ఉన్న అనుబంధాన్ని ఏకం చేస్తూ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడగలిగే సత్తా ఉన్న క్రికెటర్.. పనికిరాని వాడిగా మారిపోయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో చివాట్లు తింటూ ఎందుకు జీవించాడు? తనను అందరూ పనికిరాని వాడిగా చూస్తున్నా.. కొడుకు మాత్రం తనను హీరోలా చూడటం, కొడుకు కళ్లలో ఆ ఆనందాన్ని అలాగే నిలిపేందుకు తను వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడి సక్సెస్ కావడం.. కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికైన వ్యక్తి ఆ గేమ్ ఆడకుండానే చనిపోవడం.. చిన్నప్పుడెప్పుడో తండ్రిని అడిగిన జెర్సీ.. ఆ తండ్రి చనిపోయినా తన కారణంగానే కొడుక్కి చేరడం.. భారీ ఎమోషన్స్ నడుమ సాగిన ఈ చిత్రం తాజాగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఎంపికైంది.
నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం.. అపూర్వ ఘనత సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆగస్ట్ 9 నుంచి 15 వరకు జరగనున్న చిత్రోత్సవంలో జెర్సీతో పాటు కార్తీ ఖైదీ, సూపర్ 30 సినిమాలు ఉన్నాయి.