జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
దిశ,తెలంగాన బ్యూరో : జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాలను ఎన్‌టీఏ సోమవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించారు. టాప్ టెన్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు స్థానం సంపాదించారు. చల్లా విశ్వనాథ్ 7వ ర్యాంక్, అమేయా విక్రమా సింగ్ 8వ ర్యాంక్, పోలు లక్ష్మి సాయి లోకేష్ రెడ్డి 9వ ర్యాంక్ దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా 6,20,978 మంది పేపర్-1కు హాజరయ్యారు. మొత్తంగా 100 […]
దిశ,తెలంగాన బ్యూరో : జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాలను ఎన్‌టీఏ సోమవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించారు. టాప్ టెన్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు స్థానం సంపాదించారు. చల్లా విశ్వనాథ్ 7వ ర్యాంక్, అమేయా విక్రమా సింగ్ 8వ ర్యాంక్, పోలు లక్ష్మి సాయి లోకేష్ రెడ్డి 9వ ర్యాంక్ దక్కించుకున్నారు.
దేశవ్యాప్తంగా 6,20,978 మంది పేపర్-1కు హాజరయ్యారు. మొత్తంగా 100 స్కోర్‌ను ఆరుగురు విద్యార్థులు సాధించగా, 99 స్కోర్ సాధించిన వారిలో ముగ్గురు తెలంగాణ వారు, ఏపీకి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎస్టీ క్యాటగిరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకటి, రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో మహిళ విభాగంలో తెలంగాణకు చెందిన ఇద్దరికి మొదటి, మూడో స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో జనరల్-ఈడబ్ల్యూఎస్ విభాగంలో తెలంగాణకు చెందిన ఇద్దరికి మూడు, నాలుగు స్థానాలు లభించాయి.