కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: విద్యారంగాన్ని ఈ ఏడాది కూడా కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కొన్ని వార్షిక పరీక్షలను రద్దుచేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. తాజాగా.. జేఈఈ మెయిన్స్-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరుగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని 15 రోజుల […]
దిశ, వెబ్‌డెస్క్: విద్యారంగాన్ని ఈ ఏడాది కూడా కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కొన్ని వార్షిక పరీక్షలను రద్దుచేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. తాజాగా.. జేఈఈ మెయిన్స్-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరుగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని 15 రోజుల ముందుగానే విద్యార్థులకు తెలియజేస్తామని ఎన్‌టీఏ తెలిపింది. కాగా, ఇటీవల తెలంగాణలో కూడా ఈ ఏడాది టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదావేశారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.