జగన్‌ భస్మాసురుడంటూ జేసీ విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాలపాటు వాయిదా పడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఈసీ (ఎలక్షన్ కమిషనర్) కార్యాలయానికి వచ్చి ఈసీని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గవర్నర్, ఈసీ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారని జేసీ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి, ఆ పక్కన పోలీసులు ఉంటే సరిపోతుందనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని […]

Update: 2020-03-16 06:43 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాలపాటు వాయిదా పడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఈసీ (ఎలక్షన్ కమిషనర్) కార్యాలయానికి వచ్చి ఈసీని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గవర్నర్, ఈసీ ఎవరూ ఉండకూడదని జగన్ భావిస్తున్నారని జేసీ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి, ఆ పక్కన పోలీసులు ఉంటే సరిపోతుందనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని భస్మాసురుడు, తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. ఆ భస్మాసురుడెవరో ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. స్ధానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేయడం మంచి నిర్ణయమని ఆయన ఈసీని అభినందించారు. జగన్ చా..లా తెలివైనవాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. సామాజికవర్గం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అది లేని వారెవరో చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు.

tags : jc, tdp, ex mp, jc diwakar reddy, ysrcp, jagan

Tags:    

Similar News