సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బుమ్రా.. ఫొటోలు వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఊహించినట్లుగానే క్రికెట్ ప్రజెంటేటర్ సంజనా గణేషన్‌ను గోవాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి బుమ్రా, సంజనా కుటుంబాల నుంచి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. స్నేహితులు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ నుంచి అనూహ్యంగా బుమ్రా తప్పుకోవడంతో.. బుమ్రా పెళ్లిపై ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లి కోసం ముందే బుమ్రా సెలవు పెట్టుకున్నాడని […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఊహించినట్లుగానే క్రికెట్ ప్రజెంటేటర్ సంజనా గణేషన్‌ను గోవాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి బుమ్రా, సంజనా కుటుంబాల నుంచి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. స్నేహితులు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ నుంచి అనూహ్యంగా బుమ్రా తప్పుకోవడంతో.. బుమ్రా పెళ్లిపై ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లి కోసం ముందే బుమ్రా సెలవు పెట్టుకున్నాడని ఓ బీసీసీఐ అధికారి తాజాగా మీడియాకు వెల్లడించాడు. దీనిని బట్టి చూస్తే.. ప్లాన్ ప్రకారమే బుమ్రా పెళ్లి జరిగిందని అర్థమవుతోంది.
కరోనా క్రమంలో క్రికెటర్లందరూ బయో బబుల్‌లో ఉన్నారు. దీని వల్ల బుమ్రా పెళ్లికి టీమ్మెట్స్ ఎవరూ హాజరుకాలేదని బుమ్రా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలో బుమ్రా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాడని, దానికి అందరూ హాజరవుతారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బుమ్రా పెళ్లి ఫొటోలు వైరల్ కావడంతో.. అభిమానులు విషెస్ చెబుతున్నారు.
“Love, if it finds you worthy, directs your course.”
Steered by love, we have begun a new journey together. Today is one of the happiest days of our lives and we feel blessed to be able to share the news of our wedding and our joy with you.
Jasprit & Sanjana pic.twitter.com/EQuRUNa0Xc
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 15, 2021