పెళ్లి చేసుకుంటే.. రూ. 4.2 లక్షలు ఇస్తామంటున్న జపాన్
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు అబ్బాయికి 22 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి చేసేవాళ్లు. కానీ ఈ డిజిటల్ ఎరాలో.. పెళ్లి వయసు 30కి చేరుకుంది. పురుష పుంగవులు.. మూడు పదులు మీద పడుతున్నా బ్యాచిలర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూడుముళ్లతో కొత్త జీవితానికి స్వాగతం చెప్పేస్తున్నారు. కానీ జపాన్ బ్యాచిలర్స్ మాత్రం లైఫ్‌లో స్థిరపడాలంటూ.. 40 వస్తున్నా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. దీంతో.. జపాన్ ప్రభుత్వం […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఒకప్పుడు అబ్బాయికి 22 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి చేసేవాళ్లు. కానీ ఈ డిజిటల్ ఎరాలో.. పెళ్లి వయసు 30కి చేరుకుంది. పురుష పుంగవులు.. మూడు పదులు మీద పడుతున్నా బ్యాచిలర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూడుముళ్లతో కొత్త జీవితానికి స్వాగతం చెప్పేస్తున్నారు. కానీ జపాన్ బ్యాచిలర్స్ మాత్రం లైఫ్‌లో స్థిరపడాలంటూ.. 40 వస్తున్నా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. దీంతో.. జపాన్ ప్రభుత్వం కొత్త స్కీమ్‌తో బ్యాచిలర్స్‌కు ముక్కుతాడు వేయాలనుకుంటోంది.
జపాన్‌లోని యువత లైఫ్‌లో స్థిరపడేందుకు పెళ్లికి నో చెబుతున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా పిల్లల్ని కనడంలో లేట్ చేస్తుండటంతో జపాన్‌లో బర్త్ రేట్ గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పెళ్లి వద్దంటున్న యువతను ప్రోత్సహించేందుకు జపాన్ ప్రభుత్వం ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు 40 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న జంటకు రూ. 4.2 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తోంది. వాళ్లు కొత్త జీవితం ప్రారంభించడానికి, అద్దె చెల్లించడానికి, ఇతర ఇంటి ఖర్చులకు ఈ డబ్బులను ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ స్కీమ్ పొందడానికి పెద్దగా కండిషన్స్ అంటూ ఏమీ లేవు. పెళ్లి చేసుకునే రోజు వరకు ఆ ఇద్దరి వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఆ ఇద్దరి ఇన్‌కమ్ ఏడాదికి 5.4 మిలియన్ యెన్ (రూ. 37 లక్షలు) ఉండాలి. జపాన్‌లోని 281 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయి.