వారం రోజులుగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో గతవారం రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని అచ్చంపేట సీఐ రామకృష్ణ సూచించారు. వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం తర్వాత ఎవరూ దుకాణాలను తెరవకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు ఒక్కరు మాత్రమే వెళ్లాలని, కార్లల్లో ఇద్దరికి మించి ఎక్కుమ మంది ప్రయాణం చేయకూడదని సీఐ స్పష్టంచేశారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని […]
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో గతవారం రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని అచ్చంపేట సీఐ రామకృష్ణ సూచించారు. వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం తర్వాత ఎవరూ దుకాణాలను తెరవకూడదన్నారు.
ద్విచక్ర వాహనదారులు ఒక్కరు మాత్రమే వెళ్లాలని, కార్లల్లో ఇద్దరికి మించి ఎక్కుమ మంది ప్రయాణం చేయకూడదని సీఐ స్పష్టంచేశారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణానికి చెందిన ఎవరూ కూడా మధ్యాహ్నం తర్వాత బయటికి వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ హెచ్చరించారు.