పుస్తకాల్లో చదివినట్టు సమాజం ఉండదు: పవన్
దిశ, వెబ్‌డెస్క్: మార్పు వచ్చే వరకు ప్రయాణం ఆగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నించే తత్వం యువతలో పెరగాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన బాలాయపల్లి-గొల్లపల్లి మార్గమధ్యలో ఎదురైన యువకులతో కల్వర్టుపై కూర్చుని ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అవినీతిని ప్రశ్నించాలంటే ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు. ఇందుకోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. […]
దిశ, వెబ్‌డెస్క్: మార్పు వచ్చే వరకు ప్రయాణం ఆగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నించే తత్వం యువతలో పెరగాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన బాలాయపల్లి-గొల్లపల్లి మార్గమధ్యలో ఎదురైన యువకులతో కల్వర్టుపై కూర్చుని ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అవినీతిని ప్రశ్నించాలంటే ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు. ఇందుకోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుస్తకాల్లో ఉన్నట్టు ప్రస్తుత సమాజం లేదని ఎటు చూసిన అవినీతి నిండిపోయిందన్నారు. ఎంతో సేవ చేద్దామనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు.