క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి తనయుడు

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టింది. ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై రఘువీర్‌ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం […]

Update: 2020-12-05 21:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టింది. ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై రఘువీర్‌ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

సంతాప దినాలు ముగిసేవరకూ ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జానా రెడ్డి కుమారుడిగా తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని, తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్య ప్రచారాలను ఏ ఒక్కరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News