వివాదాస్పదంగా జనగామ డీపీఆర్వో వ్యవహారశైలి..
దిశ, జనగామ : జనగామ జిల్లా డీపీఆర్వో గౌస్ విధి నిర్వహణపై జర్నలిస్టుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఒకవేళ స్పందించినా సరైనా సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సమాచారాన్ని అన్ని పత్రికలకు ఇవ్వాల్సి ఉన్నా.. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అంటూ సమాచారం ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగ కార్యక్రమాలను పత్రికల ద్వారా ప్రజల్లోకి చేరవేయాల్సిన […]
దిశ, జనగామ : జనగామ జిల్లా డీపీఆర్వో గౌస్ విధి నిర్వహణపై జర్నలిస్టుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఒకవేళ స్పందించినా సరైనా సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సమాచారాన్ని అన్ని పత్రికలకు ఇవ్వాల్సి ఉన్నా.. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అంటూ సమాచారం ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగ కార్యక్రమాలను పత్రికల ద్వారా ప్రజల్లోకి చేరవేయాల్సిన బాధ్యత జిల్లా ప్రజాసంబంధాల అధికారిపై ఉంటుంది. కాని జనగామ జిల్లా డీపీఆర్వో అందుకు విరుద్ధంగా జర్నలిస్టులకు సరైన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారిపై జిల్లా కలెక్టర్ శివ లింగయ్య వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరుతున్నారు.