ఈటల కోసం యావదాస్తిని అమ్మేందుకైనా సిద్దం: జమున
దిశ ప్రతినిధి,మేడ్చల్ /మేడ్చల్: ఈటెల రాజేందర్ చేసే ఆత్మగౌరవ పోరాటానికి యావదాస్తిని అయినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి, ప్రముఖ మహిళ పారిశ్రామిక వేత్త ఈటల జమున స్పష్టం చేశారు. శామీర్ పేటలోని తన నివాసంలో జమున మీడియాతో మాట్లాడారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా. అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి. అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు అని ద్వజమెత్తారు. నేను కొన్న ఎకరం కంటే ఎక్కువగా ఉంటే […]
దిశ ప్రతినిధి,మేడ్చల్ /మేడ్చల్: ఈటెల రాజేందర్ చేసే ఆత్మగౌరవ పోరాటానికి యావదాస్తిని అయినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి, ప్రముఖ మహిళ పారిశ్రామిక వేత్త ఈటల జమున స్పష్టం చేశారు. శామీర్ పేటలోని తన నివాసంలో జమున మీడియాతో మాట్లాడారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా. అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి. అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు అని ద్వజమెత్తారు. నేను కొన్న ఎకరం కంటే ఎక్కువగా ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీ ప్రభుత్వం, అధికారులు ముక్కు నేలకు రాస్తారా.. ? అని సవాల్ విసిరారు. వావి వరసలు మరిచి అధికారులు నివేదిక ఇవ్వడమేమిటని మండిపడ్డారు. నమస్తే తెలంగాణ పత్రిక కోసం తమ భూములను తనఖా పెట్టామని, అలాంటి పత్రికలోనే తమపై తప్పుడు కథనాలు రాస్తుండడం బాధకరమన్నారు.
నేను వ్యాపారం చేస్తూ ఈటలను ఉద్యమంలోకి పంపానని, ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? అని ప్రశ్నించారు. తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారన్నారు. ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి అని పేర్కొన్నారు. తన ఆస్తులు అమ్మి ఐనా సరే ఈటలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మేడ్చల్ మండలంలోని రావల్ కోల్ భూములు నలుగురి చేతులు మారిన తర్వాత తాము కొనుగోలు చేశామన్నారు. దేవరయాంజల్ కు తాము 1992లోనే వచ్చామని, 1994లో భూములు కొన్నట్లు తెలిపారు.
దేనికైనా రెడీ..
తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమేనని జమున స్పష్టం చేశారు. సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం.. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెలకు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారు.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు.
గంగులపై సెటైర్లు..
వకులాభారణం మొహం చూసి ఒక్క వోట్ పడతాదా…? అని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై ద్వజమెత్తారు. అన్నా అని బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారు.నా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారు. ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నాం. నయీమ్ చంపుతాను అంటే భయపడలేదన్నారు.
కేసీఆర్ ఆస్తులపై చర్చకు సిద్దమా..?
ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా ..? అని జమున సవాల్ విసిరారు. పోలీసులు తమ కుటుంబం కోసమే పని చేస్తున్నారా అని నిలదీసారు. సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవని అసహనం వ్యక్తంచేశారు. రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..?కులాల పేరుతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎంకు చెప్పే కొన్నాం..
రావల్ కోల్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ పెడతామని వారికి(సీఎంకు) చెప్పి కొన్నాం.. అప్పుడు తెలియదా…అని జమున ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదన్నారు.ఒ క్క ఎకరా కొన్న వారికి చెప్పే కొన్నాం. అన్యాయం చేయలేదు..దోపిడీ చేయలేదు..న్యాయం గెలుస్తుందన్నారు