కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పోలీసులు బుధవారం భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. కార్ బాంబ్ పేల్చడానికి సిద్ధమవుతున్న ఓ యువకుడిని అవంతిపొరాలో ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కొన్నాళ్లుగా ఉగ్రకదలికలపై కన్నేసి ఉంచారు. ఇటీవలే ఓ యువకుడు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటంతో అతనిపై నిఘా వేసి ఉంచారు. సాహిల్ నజీర్ అనే విద్యార్థినికి ఉగ్రవాదులు టెలిగ్రామ్ యాప్ ద్వారా సూచనలు అందజేశారని పోలీసులు వివరించారు. కారులో అమర్చిన ఐఈడీని పేల్చడానికి సాహిల్ ప్రయత్నించారని తెలిపారు. ఉగ్రవాదులు తొలుత […]
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పోలీసులు బుధవారం భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. కార్ బాంబ్ పేల్చడానికి సిద్ధమవుతున్న ఓ యువకుడిని అవంతిపొరాలో ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కొన్నాళ్లుగా ఉగ్రకదలికలపై కన్నేసి ఉంచారు. ఇటీవలే ఓ యువకుడు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటంతో అతనిపై నిఘా వేసి ఉంచారు. సాహిల్ నజీర్ అనే విద్యార్థినికి ఉగ్రవాదులు టెలిగ్రామ్ యాప్ ద్వారా సూచనలు అందజేశారని పోలీసులు వివరించారు. కారులో అమర్చిన ఐఈడీని పేల్చడానికి సాహిల్ ప్రయత్నించారని తెలిపారు. ఉగ్రవాదులు తొలుత కారును కొనాల్సిందిగా ఆదేశించారని, అందుకు డబ్బునూ అందజేశారని వివరించారు. తర్వాత కారును పేల్చాల్సిందిగా ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. అప్పుడే సాహిల్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి మారుతీ కారును అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ కుట్రను సాహిల్ అంగీకరించారని, అందుకు సంబంధించిన వీడియో రికార్డు కూడా తమ దగ్గర ఉన్నదని చెప్పారు. సాహిల్ ఓ గ్రెనేడ్ దాడిలోనూ పాలుపంచుకున్నారని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగారని కశ్మీర్ ఐజీ వివరించారు.