కొవిడ్ భయం.. ఇద్దరితోనే విమానం టేకాఫ్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న టైమ్‌లో మళ్లీ న్యూ స్ట్రెయిన్ కలవరపెడుతుండగా, ఆ మహమ్మారిని అంతమొందించేందుకు పలు దేశాలు ‘వ్యాక్సిన్’‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే దాని పనితీరుపై ఇంకా ప్రజల్లో అనుమానులుండటం, వ్యాక్సిన్ వేసుకున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ ధరించడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొవిడ్-19 నుంచి తనతో పాటు తన భార్యను కూడా రక్షించుకోవడానికి ఇండోనేషియాకు […]

Update: 2021-01-08 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తగ్గుముఖం పడుతుందనుకున్న టైమ్‌లో మళ్లీ న్యూ స్ట్రెయిన్ కలవరపెడుతుండగా, ఆ మహమ్మారిని అంతమొందించేందుకు పలు దేశాలు ‘వ్యాక్సిన్’‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే దాని పనితీరుపై ఇంకా ప్రజల్లో అనుమానులుండటం, వ్యాక్సిన్ వేసుకున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ ధరించడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొవిడ్-19 నుంచి తనతో పాటు తన భార్యను కూడా రక్షించుకోవడానికి ఇండోనేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా విమానంలోని సీట్లన్నీ బుక్ చేయడం విశేషం.

కొవిడ్ విజృంభిస్తున్న నాటి నుంచి చిన్న షాప్‌లో అడుగుపెట్టాలన్నా సరే.. ఫీవర్ చెక్ చేస్తుండటంతో పాటు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచుతూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా పరిమిత సంఖ్యలోనే లోపలికి అనుమతిస్తున్నారు. అలాంటిది విమాన ప్రయాణికుల విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఊహించవచ్చు. అయితే కొవిడ్‌తో పాటు ప్రస్తుతం వేగంగా వ్యాప్తిచెందుతున్న న్యూ స్ట్రెయిన్ కూడా విమాన ప్రయాణికుల ద్వారానే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది.

ఈ క్రమంలోనే ఇండోనేషియా‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త రిచర్డ్ ముల్జాది.. తన భార్య షల్విన్నీ చాంగ్‌‌తో కలిసి జనవరి 4వ తేదీన బాలికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే కొవిడ్ భయం నేపథ్యంలో ఏకంగా విమానంలోని సీట్లన్నీ తనే బుక్ చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని రిచర్డ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో న్యూస్ వైరల్‌గా మారింది. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘విమానంలోని అన్ని సీట్లు బుక్ చేసినా ప్రైవేట్ జెట్ కంటే తక్కువే ఖర్చయింది’ అని ఆయన రాసుకొచ్చారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. జాతీయ మీడియా కథనం ప్రకారం రిచర్డ్ కేవలం రెండు టికెట్లే బుక్ చేశాడని సదరు విమానాయన సంస్థ తెలిపడం గమనార్హం.

ఆ విమానంలో ప్రయాణించడానికి కేవలం ఇద్దరు మాత్రమే టికెట్లను బుక్ చేసుకున్నారని, అందుకే విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని లయన్ గ్రూప్ విమానయాన సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సదరు విమానంలో మొత్తం 150 ఎకానమీ సీట్లు, 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉండగా, వాటిని మొత్తంగా బుక్ చేయాలంటే.. 7895 డాలర్లు (రూ. 5 లక్షల 78వేలు) చెల్లించాలని సదరు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే రిచర్డ్ ఆస్తులు, వ్యాపారాలతో పాటు అతడి రిచ్ లైఫ్‌కు అనుగుణంగా నిజంగానే విమానం బుక్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News