కోవిడ్ ఆసుపత్రిగా మారిన జైన్ దేవాలయం

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక హోటల్స్ ని తాత్కలిక కోవిడ్-19 సెంటర్స్ గా మార్చేశారు. అయినా రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడి జైన్ టెంపుల్ ఉదారత చూపింది. తమ ఆలయాన్ని కోవిడ్-19 సెంటర్‌గా మార్చుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. ఆసుపత్రిగా మారిన ఈ జైన్ దేవాలయంలో సాధారణ, డీలక్స్ వార్డులతో 100 పడకలు, […]

Update: 2021-04-17 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక హోటల్స్ ని తాత్కలిక కోవిడ్-19 సెంటర్స్ గా మార్చేశారు. అయినా రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడి జైన్ టెంపుల్ ఉదారత చూపింది. తమ ఆలయాన్ని కోవిడ్-19 సెంటర్‌గా మార్చుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. ఆసుపత్రిగా మారిన ఈ జైన్ దేవాలయంలో సాధారణ, డీలక్స్ వార్డులతో 100 పడకలు, పాథాలజీ ల్యాబ్, ఆక్సిజన్ సౌకర్యాలను పొందు పరిచారు. ఈ కేంద్రంలో 50 మంది ఆరోగ్య కార్యకర్తలు, 10 మంది వైద్యులు పనిచేస్తున్నారు. ఇలా అయిన రోగులకు చికిత్స అందుతుందని జైన్ ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడే కాకుండా గతేడాది కూడా ఈ ఆలయాన్ని తాత్కాలిక కోవిడ్-19 సెంటర్‌గా ఉపయోగించారు. జైన సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News