మాజీ తహసీల్దార్ మృతిపై జైలు అధికారుల స్టేట్మెంట్

దిశ, క్రైమ్ బ్యూరో : మాజీ తహసీల్దార్ నాగరాజు మృతిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్న విషయంపై జైలు అధికారుల ఫిర్యాదుతో డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మరణిచండంతో ఈ మృతిని కస్టోడియల్ డెత్‌గా పోలీసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా జైలు అధికారులు, నాగరాజు మృతి చెందిన గదిలో ఉండే […]

Update: 2020-10-16 10:25 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : మాజీ తహసీల్దార్ నాగరాజు మృతిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్న విషయంపై జైలు అధికారుల ఫిర్యాదుతో డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మరణిచండంతో ఈ మృతిని కస్టోడియల్ డెత్‌గా పోలీసులు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా జైలు అధికారులు, నాగరాజు మృతి చెందిన గదిలో ఉండే తోటి ఖైదీల నుంచి పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. అంతే కాకుండా, ఆత్మహత్య కంటే ముందు రోజు నాగరాజు ప్రవర్తన ఎలా ఉందనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే, తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకునే అంతటి పిరికివాడు కాదనీ, ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డబీర్ పురా ఇన్ స్పెక్టర్ సత్యనారాయణను వివరణ కోరగా.. దర్యాప్తులో భాగంగా జైలు అధికారుల, తోటి ఖైదీల స్టేట్మెంట్ ను తీసుకోవడం సహజమేనని అన్నారు.

Tags:    

Similar News