తెలంగాణలో ‘జైభీమ్‌’ సీన్ రిపీట్.. విచారణ పేరుతో గిరిజనుడిపై ఎస్సై ప్రతాపం

దిశ, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పోలీసులకు స్నేహభావం ఉండేలా ఫ్రెండ్లీ పోలీస్ వ్వవస్థని తీసుకొచ్చింది. కానీ, అందుకు భిన్నంగా కొంతమంది సిబ్బంది వ్యవహరించే తీరు ప్రభుత్వానికి మచ్చ తేవడమే కాకుండా, ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జై భీమ్‌ సినిమాతో గతంలో గిరిజనులపై పోలీసుల అరాచకాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో గురువారం జరిగిన ఓ సంఘటన పోలీస్ శాఖలో సంచలనం రేపేలా […]

Update: 2021-11-11 00:45 GMT

దిశ, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పోలీసులకు స్నేహభావం ఉండేలా ఫ్రెండ్లీ పోలీస్ వ్వవస్థని తీసుకొచ్చింది. కానీ, అందుకు భిన్నంగా కొంతమంది సిబ్బంది వ్యవహరించే తీరు ప్రభుత్వానికి మచ్చ తేవడమే కాకుండా, ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జై భీమ్‌ సినిమాతో గతంలో గిరిజనులపై పోలీసుల అరాచకాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో గురువారం జరిగిన ఓ సంఘటన పోలీస్ శాఖలో సంచలనం రేపేలా ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని రామోజీతండాకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొద్ది నెలలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. కానీ, ఇతనిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా సదరు ఎస్‌ఐ పెద్ద మనుషుల సమక్షంలో కేసులు రాజీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ గత నెలలో మండలంలోని ఏపూర్ గ్రామంలోని ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓ బెల్ట్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

కేసు విచారణలో భాగంగా నవీన్‌ను విచారించగా అదే గ్రామానికి చెందిన పలువురు తనతో పాటు దొంగతనంలో పాల్గొన్నట్టు చెప్పాడు. ఈ క్రమంలోనే విచారణ పేరుతో గుగులోతు వీరశేఖర్‌ను స్టేషన్‌‌కు పిలిపించి ఎస్ఐ దారుణంగా చితకబాదారు. కాళ్ల మీద పడ్డాగాని కనికరం చూపలేదని బాధితుడు వాపోయాడు. ఎస్సై దాడిలో వీర శేఖర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వెళ్లిన తరువాత అతని పరిస్థితి మరింత విషమం కావడంతో బాధితుడిని తీసుకొని అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సై‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం సదరు యువకుడిని హాస్పిటల్‌కు తరలించారు. వాగ్వాదం సమయంలో బాధిత కుటుంబీకులు నానాబూతులు తిడుతున్నప్పటికీ సదరు ఎస్సై గ్రామ పెద్దలను బతిమాలుకోవడం గమనార్హం. దీంతో ఆ అధికారి ఎంతలా కొట్టాడో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సిందే.

పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజనులు..

Tags:    

Similar News