కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. సోనియాకు లేఖ రాసిన జగ్గారెడ్డి

దిశ, వెబ్ డెస్క్: దూకుడుగా దూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి సోంత గూటిలోనే ఇబ్బందులు తప్పడం లేదు. రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి మరోసారి జగ్గారెడ్డి లేఖ రాశారు. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండానే రైతులను కలవడానికి వస్తా అని ఎలా ప్రకటిస్తారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంప్రదాయాలను ఆయన పాటించడం లేదని ఇది పార్టీకి ప్రమాదం అని హెచ్చరించారు. ఇక ఆయన మైండ్ సెట్ అయినా మార్చండి లేదంటే […]

Update: 2021-12-27 21:30 GMT

దిశ, వెబ్ డెస్క్: దూకుడుగా దూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి సోంత గూటిలోనే ఇబ్బందులు తప్పడం లేదు. రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి మరోసారి జగ్గారెడ్డి లేఖ రాశారు. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండానే రైతులను కలవడానికి వస్తా అని ఎలా ప్రకటిస్తారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంప్రదాయాలను ఆయన పాటించడం లేదని ఇది పార్టీకి ప్రమాదం అని హెచ్చరించారు. ఇక ఆయన మైండ్ సెట్ అయినా మార్చండి లేదంటే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను పాటించే మరో వ్యక్తిని అయినా ఆ స్థానంలో పెట్టండి అంటూ సోనియా గాంధీకి నాలుగు పేజీల లేఖ రాశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండి పడ్డారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, తెలంగాణ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ లకు ఆ లేఖ కాపీలను పంపారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా పార్టీని నడవడం లేదని, ఆయన ఒక కార్పోరేట్ స్టైల్ లో నడిపిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ పీఏసీ లో ఏ విషయాలు చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తిని అధిష్టానం తీసురావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన నిర్ణయాలు పార్టీలో నాయకులకే కాదు పార్టీకి చెడ్డపేరును తీసుకువస్తుందని అన్నారు.

నాకు ఆయన తో విరోదం లేదని, కేవలం పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే లేఖ రాస్తున్నానని వివరించారు. వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఇది పార్టీకి మరిన్ని కష్టాలు తీసుకువస్తుందని అన్నారు. ఆయన నేతృత్వం వహించిన పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని పెట్టలేదని తెలిపారు. తెలంగాణ లో హుజూరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో కనీసం 3 వేలు కూడా ఓట్లు రాలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నేను విన్నవించిన అంశాలను అదిష్టానం ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News