కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకున్నాం : జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సొంత జిల్లా.. ట్రబుల్ షూటర్ హరీష్ ఉన్న మెదక్‌లో మా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాపాడుకున్నామని అన్నారు. 231 కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన మాది నైతిక గెలుపేనని మాకున్న ఓట్ల కంటే ఏడు ఓట్లు అదనంగా సాధించామని హర్షం వ్యక్తంచేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సొంత జిల్లా.. ట్రబుల్ షూటర్ హరీష్ ఉన్న మెదక్‌లో మా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాపాడుకున్నామని అన్నారు. 231 కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన మాది నైతిక గెలుపేనని మాకున్న ఓట్ల కంటే ఏడు ఓట్లు అదనంగా సాధించామని హర్షం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ట్రబుల్‌లో పడ్డారని ఎద్దేవ చేశారు.
కాంగ్రెస్ భయానికి ఆఖరికి.. టీఆర్ఎస్ క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మా స్థానిక ప్రజాప్రతినిధులు ఏ క్యాంపులకు వెళ్ళలేదని, ఎన్నికల్లో మేము ఎటువంటి ప్రలోభాలకు పాల్పడలేదని అన్నారు. ఉమ్మడి మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డి కోసం జిల్లా కాంగ్రెస్ నాయకత్వం బాగా పనిచేసిందని ఏ ఆలోచనతో పోటీ చేశామో ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. మా కాంగ్రెస్ అభ్యర్థి వల్ల జిల్లాలో స్థానిక నేతలు హ్యాపీగా ఉన్నారని తెలిపారు. ఇక నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో గేమ్ స్టార్ట్ చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.