ఎల్.ఆర్.ఎస్‌పై స్పష్టత వచ్చే వరకు పోరాటం: జగ్గారెడ్డి

దిశ,వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టత వచ్చే వరకు పోరాడుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్.ఆర్.ఎస్ ప్రకటనలో స్పష్టత లేదని ఆయన అన్నారు. క్రమబద్దీకరణ అంశం గురించి జీ.ఓలో ప్రస్తావించలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన అంశంలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో రేపటి దీక్షను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు సంతృప్తి […]

Update: 2020-12-29 10:45 GMT
mla jaggareddy
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టత వచ్చే వరకు పోరాడుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్.ఆర్.ఎస్ ప్రకటనలో స్పష్టత లేదని ఆయన అన్నారు. క్రమబద్దీకరణ అంశం గురించి జీ.ఓలో ప్రస్తావించలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన అంశంలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో రేపటి దీక్షను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు సంతృప్తి చెందితేనే ఎల్‌ఆర్‌ఎస్‌పై తాను ఉద్యమం విరమించుకుంటానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News