అలా చేస్తే నా భార్యను పోటీ నుంచి తప్పిస్తా.. జగ్గారెడ్డి బంపర్ ఆఫర్

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థలకు నిధులిస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ. 20 వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]

Update: 2021-11-26 08:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థలకు నిధులిస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ. 20 వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్ డ్రా చేపిస్తా అని హరీష్ రావుకు ఛాలెంజ్ విసిరారు. సీఎల్పీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు రూ. 20 వేల కోట్లు తీసుకువస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయని, కానీ వారికి పవర్ లేదని, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా నిధులు శూన్యమని, ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారని ఆరోపించారు.

మెదక్‌లో కాంగ్రెస్‌కు 230 ఓట్లు ఉన్నాయని, గెలిచే ఓట్లు లేకున్నా తన భార్య నిర్మలను స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో పెట్టానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టాం కాబట్టే ఎంపీటీసీ, జడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నారని, రెండు సంవత్సరాల నుంచి వారితో హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందన్నారు.

Tags:    

Similar News