BJP ఎంపీ తేజస్వి ఎంట్రీపై TRS నేత ట్వీట్.. నెట్టింట్లో వివాదాస్పద చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలన్నీ ప్రస్తుతం ట్విట్టర్‌లోనే జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ట్వీట్లు.. రీట్వీట్లు చేసుకుంటూ చర్చలకు దారితీస్తున్నారు. నాయకుల ట్వీట్లకు నెటిజన్ల కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్ జగన్ ట్వీట్‌ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్‌లో ‘‘తెలంగాణ కోసం పోరాడి, త్యాగాలు చేసిన మన విద్యార్థి-యువ నాయకుల మీద కురిపించండి ఆ పూల […]
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలన్నీ ప్రస్తుతం ట్విట్టర్‌లోనే జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ట్వీట్లు.. రీట్వీట్లు చేసుకుంటూ చర్చలకు దారితీస్తున్నారు. నాయకుల ట్వీట్లకు నెటిజన్ల కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్ జగన్ ట్వీట్‌ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్‌లో ‘‘తెలంగాణ కోసం పోరాడి, త్యాగాలు చేసిన మన విద్యార్థి-యువ నాయకుల మీద కురిపించండి ఆ పూల వర్షం!, మన తెలంగాణకి రావాల్సిన కేటాయింపులను తన రాష్ట్రానికి తన్నుకుపోయిన ఆ “తేజస్వి సూర్య” పై కాదు ! ’’ అని జగన్ ట్వీట్ చేశారు. దీంతో జగన్ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ.. కామెంట్లు చేస్తున్నారు.
అందులో కొన్ని ట్వీట్లు… ‘‘1200మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎవరు అనుభవిస్తున్నారు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని రాజ్యమేలుతున్న మీరా మాట్లాడేది.’’ అని ఒకరు ట్వీట్ చేస్తే, ‘‘శ్రీనివాసాచారి వాళ్ళ అమ్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా మొన్న కవితకు, నిన్న కౌశిక్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు.? ఉద్యమకారుల మీద మీ కపట ప్రేమ వద్దు.. ఉద్యమకారులను వాడుకొని, కోట్లు దండుకున్న సిగ్గులేని కుటుంబం ఎవరిదో అందరికీ తెలుసు.’’ అంటూ మరొకరు, ‘‘Who fought, Sacrificed for Telangana and Who is enjoying the luxurious life?Who is responsible for this mess?Do u know how many sacrifices their life’s?Have they benefited after formation of Telangana?We want give the benefits of Real fighters of TS not reel fighters.’’ అని ఓ నెటిజన్, ‘‘మన రాష్ట్రానికి రావాల్సినవి పక్క రాష్ట్రానికి పోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో? విద్యార్థి నాయకులు ఇన్నేండ్లు గుర్తు రాలేదా?, తేజస్వి సూర్య రాగానే గుర్తొచ్చారా?’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
తెలంగాణ కోసం పోరాడి త్యాగాలు చేసిన మన మన విద్యార్థి-యువ నాయకుల మీద కురిపించండి ఆ పూల వర్షం !
మన తెలంగాణకి రావాల్సిన కేటాయింపులను తన రాష్ట్రానికి తన్నుకుపోయినా ఆ
"తేజస్వి సూర్య" పై కాదు !
Why #TejaswiInTelangana ? @kishanreddybjp @KTRTRS— Jagan Patimeedi (@JAGANTRS) September 7, 2021