ఈటల ఔట్… కొత్త వైద్యారోగ్య శాఖ మంత్రి ఈయనే..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఉద్వాసన ఖరారైంది. ఆయన పరిధిలోని వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం కేబినెట్లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన్ను ఇంకా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయలేదు. కాగా వైద్యారోగ్య శాఖకు కొత్త మంత్రిగా జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డికి అవకాశం రానున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రగతిభవన్ నుంచి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఉద్వాసన ఖరారైంది. ఆయన పరిధిలోని వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం కేబినెట్లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన్ను ఇంకా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయలేదు. కాగా వైద్యారోగ్య శాఖకు కొత్త మంత్రిగా జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డికి అవకాశం రానున్నట్లు సమాచారం.
త్వరలోనే ప్రగతిభవన్ నుంచి ప్రకటన వస్తుందని సమాచారం. ఇప్పటికే లక్ష్మారెడ్డికి ప్రగతిభవన్ నుంచి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను ప్రగతిభవన్‌కు రావాలని సూచించినట్లు సమాచారం. గతంలో ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ఆయనకే మళ్లీ వైద్యారోగ్య శాఖను అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.