యాక్షన్ ఐకాన్‌గా నిలుస్తా : జాక్వెలిన్

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లోనే గడిపిన విషయం తెలిసిందే. అక్కడే సల్మాన్, జాక్వెలిన్ కలిసి నటించిన ‘తేరే బినా’ అనే పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక ‘అలాడిన్‘ అనే ఫాంటసీ డ్రామా ద్వారా నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ శ్రీలంకన్ బ్యూటీ.. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జాక్వెలిన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జాక్వెలిన్ […]

Update: 2020-05-31 07:38 GMT

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లోనే గడిపిన విషయం తెలిసిందే. అక్కడే సల్మాన్, జాక్వెలిన్ కలిసి నటించిన ‘తేరే బినా’ అనే పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక ‘అలాడిన్‘ అనే ఫాంటసీ డ్రామా ద్వారా నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ శ్రీలంకన్ బ్యూటీ.. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జాక్వెలిన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జాక్వెలిన్ పలు విషయాలను పంచుకుంది. ‘నేను పోషించిన ప్రతి క్యారెక్టర్ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇన్నేళ్ల కెరీర్‌లో పేరుపొందిన నటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులందరితోనూ పని చేశాను. చాలెంజింగ్ రోల్స్‌తో పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశమిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పటిదాకా నేనే నేర్చుకున్న విషయాలు నా నటనను మరింత మెరుగు పరుస్తాయనుకుంటున్నా. యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. త్వరలోనే ‘యాక్షన్ ఐకాన్’గా నిలుస్తాననే నమ్మకముంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్ రీతుల్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాను’ అని జాక్వెలిన్ పేర్కొన్నారు.

2011లో మర్డర్-2 ద్వారా తొలి విజయాన్ని అందుకున్న జాక్వెలిన్.. ఆ తర్వాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2, రేస్ -2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి. హౌస్ ఫుల్ -2 సినిమాలోని నటనకుగానూ ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Tags:    

Similar News