ఆర్టీసీ పరిరక్షణకు జేఏసీ పోరాటం

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యలపై ఉద్యమించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకున్నట్లు వెల్లడించారు. టీఎస్​ఆర్టీసీ జేఏసీ సమావేశం ఎంప్లాయిస్​యూనియన్​కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్​ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని, ఈ నెల 31లోగా అన్ని రీజియన్లలో జేఏసీలు ఏర్పాటు చేస్తామన్నారు. రీజియన్​ జేఏసీల ఏర్పాటు కసం […]

Update: 2021-07-23 11:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యలపై ఉద్యమించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకున్నట్లు వెల్లడించారు. టీఎస్​ఆర్టీసీ జేఏసీ సమావేశం ఎంప్లాయిస్​యూనియన్​కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్​ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని, ఈ నెల 31లోగా అన్ని రీజియన్లలో జేఏసీలు ఏర్పాటు చేస్తామన్నారు.

రీజియన్​ జేఏసీల ఏర్పాటు కసం జోన్ల వారీగా బాధ్యతలను అప్పగించామని, కరీంనగర్​, నిజామాబాద్, హైదరాబాద్​గ్రేటర్​రీజియన్లకు జేఏసీ చైర్మన్​రాజిరెడ్డి, రంగారెడ్డి, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ రీజియన్లకు వైస్​చైర్మన్​హన్మంత్​ముదిరాజు, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం రీజియన్లకు కన్వీనర్​వీఎస్​రావు బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 26న ఆర్టీసీ యాజమాన్యం వైఖరికి నిరసనగా లేబర్​కమిషనర్‌గా ఫిర్యాదు చేస్తామని, వచ్చేనెల 3న హైదరాబాద్​లో విస్తృతస్థాయి కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

జేఏసీ వైస్​చైర్మన్​హన్మంత్​ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వచ్చేనెల 7న బస్​భవన్​ఎదుట నిరసన, 10న ఆయా డిపోల పరిధిలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధి సమస్యల పరిష్కారానికి పార్లమెంట్​సమావేశాల్లోనే నితిన్​ గడ్కరీకి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కో కన్వీనర్లు అబ్రహం, యాదయ్య, సురేష్, యాదగిరి, రమేష్​ కుమార్, హరికిషన్, గోపాల్​ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News