శ్రీవారి నిధుల మళ్లింపుపై వివరణ ఇవ్వాలి
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. శ్రీవారి నిధుల మళ్లింపు వ్యవహారంపై టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా ఐవైఆర్ పేర్కొన్నారు. ఈనాడు ఉన్న విధానం ప్రకారం జాతీయ బ్యాంకుల నుండి కొటేషన్లు తీసుకొని అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులో డిపాజిట్ చేసే విధానం. ఈ విధానం మార్చవల్సిన అవసరం వివరించాలని అన్నారు. రాష్ట్రాలకు అప్పుల సేకరణ కోసం ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుందని అన్నారు. అటువంటి […]
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. శ్రీవారి నిధుల మళ్లింపు వ్యవహారంపై టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా ఐవైఆర్ పేర్కొన్నారు. ఈనాడు ఉన్న విధానం ప్రకారం జాతీయ బ్యాంకుల నుండి కొటేషన్లు తీసుకొని అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులో డిపాజిట్ చేసే విధానం. ఈ విధానం మార్చవల్సిన అవసరం వివరించాలని అన్నారు. రాష్ట్రాలకు అప్పుల సేకరణ కోసం ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుందని అన్నారు.
అటువంటి బాండ్లలో పెట్టటానికి టిటిడికి అర్హత ఉందా? ఉంటే అక్కడ ఎక్కువ వడ్డీ రేటు వచ్చేటట్లు అయితే పెట్టడానికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో బడ్జెట్ బయట ఎస్పివీ ల ద్వారా ఋణ శేకరణకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. బ్యాంకులు అంతగా సహకరిస్తున్నట్లు లేదు.
— IYRKRao , Retd IAS (@IYRKRao) October 17, 2020
అలాంటి బాండ్లలో పెట్టటానికి టీటీడీకి అర్హత ఉందా అంటూ ఐవైఆర్ ప్రశ్నించారు. ఉంటే అక్కడ ఎక్కువ వడ్డీ రేటు వచ్చేటట్లు అయితే పెట్టడానికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో బడ్జెట్ బయట ఎస్పీవీ ల ద్వారా రుణ సేకరణకు విశ్వ ప్రయత్నం చేస్తోందని.. బ్యాంకులు అంతగా సహకరిస్తున్నట్లు లేదని ఐవైఆర్ తెలిపారు. అటువంటి బాండ్లలో పెట్టుబడి పెట్టడం అంటే నిస్సందేహంగా ఇటు ప్రభుత్వం ఒత్తిడి అటు టీటీడీ అధికార దుర్వినియోగం కిందకే వస్తుందంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు.