ఇవాంక పట్టు షేర్వాణీ ధర రూ. 82 వేలు

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ మొదటిరోజు వేసుకున్న ఎరుపు పూల డ్రెస్‌ను ఇంతకుముందు వేసుకుందే అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలు అన్న వాళ్లే ఆమె రెండో రోజు పర్యటనలో వేసుకున్న పట్టు శేర్వాణీ చూసి నోళ్లు మూసుకున్నారు. అవును.. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకకు ఇవాంక ట్రంప్ తెలుపు రంగు పట్టు సురుహి శేర్వాణీ వేసుకుని హాజరయ్యారు. ఈ […]

Update: 2020-02-25 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్ మొదటిరోజు వేసుకున్న ఎరుపు పూల డ్రెస్‌ను ఇంతకుముందు వేసుకుందే అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలు అన్న వాళ్లే ఆమె రెండో రోజు పర్యటనలో వేసుకున్న పట్టు శేర్వాణీ చూసి నోళ్లు మూసుకున్నారు.

అవును.. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకకు ఇవాంక ట్రంప్ తెలుపు రంగు పట్టు సురుహి శేర్వాణీ వేసుకుని హాజరయ్యారు. ఈ శేర్వాణీని అనితా డోంగ్రే డిజైన్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కి వస్త్రకారులు చేతులతో అల్లిన ఈ శేర్వాణీ ధర రూ. 82,400. బెంగాల్‌లోని ముషీరాబాద్ నుంచి తీసుకుని వచ్చిన పట్టుతో దీన్ని తయారుచేసినట్లు అనితా డోంగ్రే తెలిపారు. ఇవాంకా కంటే ముందు కేంబ్రిడ్జ్ డ్యూచెస్ కేట్ మిడెల్టన్, బెల్జియం రాణి మాతిల్దే, కెనడా ఫస్ట్ లేడీ సోఫీ గ్రెగోరి త్రెదో, అమెరికా మాజీ మొదటి మహిళ హిల్లరీ క్లింటన్‌లు భారత్‌కి వచ్చినపుడు కూడా అనితా డోంగ్రే డిజైన్ చేసిన దుస్తులే ధరించారు.

Tags:    

Similar News